కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1928 - మార్చి 5, 2004) ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచాడు.
జగ్గయ్య గురించి చెప్పేటప్పుడు ఆయన కంఠం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గంభీరమైన తన కంఠాన్ని ఎంతోమందికి అరువు ఇచ్చాడు. 100కు పైగా సినిమాలలో డబ్బింగు చేసాడు. తమిళ చిత్రరంగ ప్రముఖుడైన శివాజీ గణేశన్ నటించిన తెలుగు సినిమాలలో జగ్గయ్యే ఆయనకు గాత్రధారణ చేసేవాడు. అంతేకాదు తెలుగులోకి డబ్బింగు చేసిన జురాసిక్ పార్క్ అనే ఆంగ్ల చిత్రంలో రిచర్డ్ అట్టెంబరో పాత్రకు తన గాత్రాన్ని అరువు ఇచ్చాడు.
నోబెల్ పురస్కారము అందుకున్న రవీంద్రుని గీతాంజలిని రవీంద్ర గీతా అనే పేరుతో తెలుగులోకి అనువాదించారు. గీతాంజలికి ఇది తొలి తెలుగు అనువాదం. రవీంద్రనాథ ఠాగూరు రాసిన నాటకం సాక్రిఫైస్ (Sacrifice)ను తెలుగులోకి బలిదానం అనే పేరుతో అనువదించాడు.
Podchaser is the ultimate destination for podcast data, search, and discovery. Learn More